రెండో విడతలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 61 పంచాయతీలు ఏకగ్రీవం

 రెండో విడతలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 61 పంచాయతీలు ఏకగ్రీవం

నల్గొండ, వెలుగు: రెండో విడత ఎన్నికల్లోనూ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. మొదటి విడత తరహాలోనే ఇంచుమించు సర్పంచ్​ సీటుకు ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, వార్డు స్థానాలకు ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు. రెండో విడతలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మొత్తం 61 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థుల తుది జాబితా ఆదివారం రాత్రి ప్రకటించారు.

 నల్లగొండ జిల్లాలో 282 పంచాయతీ లకు 38 ఏకగ్రీవంకాగా, 241 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 764 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2,41 8 వార్డులకు 1831 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 4,684 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

మండలాల వారీగా పరిశీలిస్తే అడవిదేవుపల్లి మండలంలో 31, అనుమల మండలంలో 66, దామరచర్లలో 118, మాడ్గులపల్లిలో 62, మిర్యా లగూడలో 122, నిడ మనూరులో 83, పెద్దవూరలో 71, తిరుమల గిరి సాగర్​లో 88, త్రిపురారంలో 81, వేములపల్లి మండలంలో 42 మంది అభ్యర్థులు పో టీలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో సర్పంచ్​ స్థానాలకు ముగ్గురు, నలుగురు పోటీలో ఉండగా, వార్డులకు ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 181 పంచాయతీలకు గాను 23 ఏకగ్రీవం కాగా, 158 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

493 మంది అభ్యర్థు లు పోటీలో ఉన్నారు. 1628 వార్డులకుగాను 339 ఏకగ్రీవం కాగా, 1287 వార్డులకు 3,224 మంది పోటీలో ఉన్నారు. ఈ జిల్లాలో సర్పంచ్​ స్థానాలకు ముగ్గురు పోటీలో ఉండగా, వార్డులకు ఇద్దరు, ముగ్గురు చొప్పున బరిలో ఉన్నారు. అనంతగిరి మండలంలో 60, చిలుకూరులో 35, చివ్వెంల 89, కోదాడ 47, మెతె 70, మునగా ల 58, నడిగూడెం 43, పెన్​పహాడ్​లో 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

ఏకగ్రీవం అయిన గ్రామాలు 

సూర్యాపేట జిల్లాలో కోదాడ రూరల్ లో చిమిర్యాల, కూచిపూడి, చిలుకూరు మండలంలో కొమ్ముబండ తండా, రామచంద్రానగర్, సీతల తండా, మాధవ గూడెం, చేన్నారి గూడెం, అనంతగిరి మండలంలో అజ్మీరా తండా, పాలారం, కృష్ణాపురం, నడిగూడెం మండలంలో బృందావనపురం, చాకిరాల, శ్రీరంగపురం, మునగాల మండలంలో ఈదులు వాగు తండా, మోతే మండలంలో మామిల్లగూడెం, విబులాపురం, రాంపురం తండా, లాల్ తండా, భళ్ళు తండా, గోల్ తండా, రావికుంట తండా, చివ్వేంల మండలంలో గుర్రం తండా, పులితండ గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.