జపాన్లో భారీ భూకంపం..హక్కడై ప్రాంతంలో భారీ ప్రకంపనలు

జపాన్లో భారీ భూకంపం..హక్కడై ప్రాంతంలో భారీ ప్రకంపనలు

జపాన్​ లో భారీ భూకంపం సంభవించింది. శనివారం (మే31) మధ్యాహ్నం హక్కైడోలో రిక్టర్ స్కేల్ 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది 20 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జపాన్​వాతావరణ సంస్థ తెలిపింది. కుషిరోకు ఆగ్నేయంగా 42.3°N అక్షాంశం ,144.5°E రేఖాంశం వద్ద 20 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరిక ఏమీ లేవని ఏజెన్సీ తెలిపింది. ప్రాణనష్టం, ఆస్థినష్టం పై ఇంకా వివరాలు తెలిసిరాలేదు. 

కుషిరో నగరం, కుషిరో పట్టణం ,షిబెచా పట్టణం వంటి ప్రాంతాలలో భూకంప తీవ్రత స్కేల్ గరిష్టంగా 6.1 గా నమోదైంది. హోన్షులోని అమోరి ప్రిఫెక్చర్‌లోని ఒబిహిరో పట్టణం, నెమురోపట్టణం ,హచినోహే పట్టణంతో సహా ఇతర ప్రదేశాలు తీవ్రత స్కేల్ 3గా నమోదు అయింది. 

జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (NHK) రిపోర్టు ప్రకారం.. భూకంపం కారణంగా అనేక ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ప్రజలు గాయపడటం గానీ, చనిపోవడం గానీ,  ఆస్తి నష్టం గానీ సంభవించలేదు.