
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 627 ఫిర్యాదులు అందాయి. వీటిలో హౌసింగ్ కు సంబంధించి 185, సోషల్వెల్ఫేర్ విభాగానికి 108, రెవెన్యూకు 60, విద్యుత్ శాఖకు సంబంధించి 57, ప్రవాసీ ప్రజావాణికి 4, ఇతర విభాగాలకు చెందినవి 213 ఉన్నాయి.
రెండో దశ దళితబంధు విడుదల చేయాలంటూ కొందరు ప్రజాభవన్ఆవరణలో బైఠాయించారు. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామానికి చెందిన వేణుగోపాలచారి, రుక్మిణి దంపతులు ప్రజాభవన్ ప్రజావాణికి థ్యాంక్స్చెప్పారు. ఫిర్యాదు చేసిన మూడు నెలల్లో అధికారులు తమ భూమికి పట్టాదార్పాస్బుక్వచ్చేలా చేశారని చెప్పారు.