కరోనా పంజా.. 50 వేలకు చేరువైన కరోనా మరణాలు..

కరోనా పంజా.. 50 వేలకు చేరువైన కరోనా మరణాలు..

దేశంలో  కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొన్ని రోజులగా దాదాపు 65 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  63,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25,89,682కు చేరింది. ఒక్కరోజే 944 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 49,980 కి చేరింది.

నిన్నటి వరకు కరోనా నుంచి 18,62,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా  6,77,444 మంది  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 7,46,608 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆగస్టు 15 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 2,93,09,703 కు చేరింది.