పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం

పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం

కోకోపో: ఉత్తర పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించిందింది. ఏప్రిల్ 15వ తేదీ  సోమవారం తెల్లవారుజామున 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.న్యూ బ్రిటన్ ద్వీపంలోని కింబేకి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 110 కిలోమీటర్లు దూరంలో 64 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే దీని వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపంతో స్థానికంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని తెలిపింది.

గత నెలలో 6.9 తీవ్రతతో పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప ప్రమాదంతో దాదాపు 1,000  ఇండ్లు ధ్వంసమయ్యాయి.  ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.