హైకోర్టులో 65 పోస్టులు

హైకోర్టులో 65 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోర్టు మాస్టర్లు/ పర్సనల్‌‌ సెక్రెటరీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్త 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: ఆర్ట్స్‌‌/ సైన్స్‌‌/ కామర్స్‌‌/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రభుత్వం నిర్వహించిన ఇంగ్లిష్‌‌ షార్ట్‌‌హ్యాండ్‌‌ పరీక్షలో  (నిమిషానికి 180 పదాలు) అర్హత, ఇంగ్లిష్‌‌లో టైప్‌‌రైటింగ్‌‌ హయ్యర్‌‌గ్రేడ్‌‌ అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌హ్యాండ్‌‌ ఇంగ్లిష్‌‌ (నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాలు), ఓరల్‌‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్‌‌లైన్‌‌ ద్వారా జులై 22 వరకు అప్లై చేసుకోవాలి.  
అడ్రస్​: రిజిస్ట్రార్‌‌ (రిక్రూట్‌‌మెంట్‌‌), తెలంగాణ  హైకోర్టు, హైదరాబాద్‌‌-500066.  వివరాలకు www.tshc.gov.in వెబ్​సైట్​ 
సంప్రదించాలి.