
ఖమ్మం, వెలుగు : ప్రముఖ అంతర్జాతీయ వాహన రంగ సంస్థ రెనాల్ట్ నిస్సాన్ కు తమ కళాశాలకు చెందిన 65 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. శుక్రవారం కళాశాల ఆవరణలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఆయన మాట్లాడారు.
పెరుగుతున్న ప్రమాణాల దృష్ట్యా వాహన రంగంలో రానున్న రోజుల్లో మరింత ఆదరణ ఉందని కృష్ణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా జి. ధాత్రి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ పాల్గొన్నారు.