మంచిర్యాల జిల్లాలో జోరుగా రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు

మంచిర్యాల జిల్లాలో  జోరుగా రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలంగాణ మోడల్​ స్కూల్ ​గ్రౌండ్​లో రెండు రోజులుగా కొనసాగుతున్న 69వ ఎస్​జీఎఫ్​ రాష్ట్రస్థాయి అండర్​19 గర్ల్స్ సెలక్షన్స్​ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రెండో రోజు సెమీఫైనల్స్​లో మహబూబ్​నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్​ జిల్లాల జట్లు పోటీ పడ్డాయి. 

మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్స్​ అసోసియేషన్​ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్​రెడ్డి చీఫ్​గెస్ట్​గా హాజరై పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పోటీల్లో 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని ఉమ్మడి జిల్లా కాలేజ్ గేమ్స్​ ఫెడరేషన్​ కార్యదర్శి, టోర్నమెంట్​ఆర్గనైజర్ బి.బాబురావు, కన్వీనర్ ​డీఐఈవో కె.అంజయ్య తెలిపారు. 

ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేస్తామని, జనవరిలో నాగ్​పూర్​లో జరిగే పోటీల్లో వారు పాల్గొంటారని చెప్పారు. టోర్నీ అబ్జర్వర్​గా పీడీ గంగామోహన్​ వ్యవహరించారు. కార్యక్రమంలో మోడల్​స్కూల్​ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​ పెద్దన్న, మంచిర్యాల జిల్లా ఎస్​జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకుబ్, పీఈటీలు, అసోసియేషన్​ బాధ్యులు పాల్గొన్నారు.