తక్కువ రేట్లకే 7 డేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిప్

తక్కువ రేట్లకే 7 డేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిప్

సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’.  మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. జూన్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిన్న కొత్త ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాజు మాట్లాడుతూ ‘ఇద్దరు యువకుల జర్నీ ఇది. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమా. అందుకే తక్కువ రేటుకు టికెట్స్ అమ్మమని డిస్ట్రిబ్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెప్పా. ఈ చిత్రంతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ద బెస్ట్. సుమంత్ డీ గ్లామరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్ చేశాడు. రోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హీరోయిన్లు  కొత్తవాళ్లు అయినా చక్కగా నటించారు’ అన్నారు. ‘ఫస్ట్ కాపీ చూశాం. ఓ మాస్టర్ పీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కనిపించింది. టీమ్ అందరికీ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అన్నాడు సుమంత్. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకి రోహన్, మెహర్, కృతిక థ్యాంక్స్ చెప్పారు. నిర్మాతలు రజనీకాంత్, రిషితా దేవి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి తదితరులు పాల్గొన్నారు.