
క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. రోజురోజుకు ఈవ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఆధునిక చికిత్స విధానం వచ్చినప్పటికీ పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకముందే దానిని అడ్డుకోవడం చాలా ఉత్తమం అంటున్నారు డాక్టర్లు. ఇందుకోసం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చాలా సులభం.. చాలా వరకు క్యాన్సర్‌ను జయించే అవకాశం ఉందంటున్నారు.
క్యాన్సర్చాలా రకాలు ఉంటుంది. ఇందులో బోన్ క్యాన్సర్ ఒకటి. బోన్స్ క్యాన్సర్ ప్రాణాంతకమైంది.. దీనికి ముందుగా పసిగడితే చికిత్స ద్వారా నయం అవుతుందంటున్నారు డాక్టర్లు. బోన్ క్యాన్సర్ అటాక్ అవుతున్న సమయంలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
నిరంతర ఎముక నొప్పి: బోన్ క్యాన్సర్ అటాక్ అవుతున్న సమయంలో ప్రభావిత ఎముకలో రాత్రిపూట లేదా పనిచేసే సమయంలో నొప్పి తీవ్రమవుతుంది. కాలక్రమేణా పెరుగుతుంది.
వాపు లేదా గడ్డ: నొప్పి ప్రారంభమైన వారాల తర్వాత ప్రభావిత ఎముక దగ్గర గుర్తించదగిన వాపు లేదా గడ్డ ఏర్పడవచ్చు.
బోన్ పగుళ్లు: క్యాన్సర్ వల్ల బలహీనమైన ఎముకలు చిన్ని చిన్న దెబ్బలు తాకినా లేదా సాధారణంగా పగుళ్లతో విరిగిపోవడం జరుగుతుంది.
అలసట: శరీరం క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు శరీరకంగా శ్రమ చేయకున్నా , కూర్చున్నా కూడా అలసిపోయినట్లు అనిపించడం,శక్తి లేకపోవడం సంభవించవచ్చు.
►ALSO READ | మీకు తెలుసా: స్పాటిఫైలో పాటలు వినడమే కాదు.. మెసేజ్ కూడా చేయొచ్చు.. !
ఊహించని బరువు తగ్గడం: బోన్ క్యాన్సర్ ప్రభావం కారణంగా ఆకస్మికంగా,అధికమొత్తంలో బరువు తగ్గడం జరుగుతుంది.
కణితి ఉన్న ప్రదేశంలో సున్నితత్వం: కణితి చుట్టూ ఉన్న ప్రాంతం తాకడానికి వెచ్చగా లేదా మృదువుగా అనిపించవచ్చు.
తిమ్మిరి లేదా జలదరింపు: కణితి సమీపంలోని నరాలపై ఒత్తిడిని కలిగిస్తే అది పిన్స్-అండ్-నీడిల్స్ అనుభూతిని లేదా అవయవాలలో తిమ్మిరిని కలిగిస్తుంది.