మీకు తెలుసా: స్పాటిఫైలో పాటలు వినడమే కాదు.. మెసేజ్ కూడా చేయొచ్చు.. !

మీకు తెలుసా: స్పాటిఫైలో పాటలు వినడమే కాదు..  మెసేజ్ కూడా చేయొచ్చు.. !

ఇప్పటికే షార్ట్​ మెసేజ్​ల కోసం మేసేజెస్​, వాట్సాప్​, టెలిగ్రామ్ ఇలా రకరకాల ప్లాట్​ఫామ్స్ వాడుతున్నారు. అంతేకాకుండా ఇన్​స్టా, శ్నాప్​ చాట్, ఫేస్​బుక్​లలోనూ మెసేజ్​ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మెసేజ్​లు పంపేందుకు మరో ప్లాట్​ఫాం కూడా యాక్సెస్ ఇచ్చింది. మ్యూజిక్ లవర్స్​కు దగ్గరైన స్పాటిఫై యాప్​లో ఈ మధ్యకాలంలో రకరకాల అప్​డేట్​లు వస్తూ ఉన్నాయి. అలానే ఇప్పుడు స్పాటిఫై యాప్​లో యూజర్లు ఫ్రీగా మెసేజింగ్​ ఫీచర్​ను వాడుకోవచ్చు. 

ఇది మెసేజ్​లను మాత్రమే కాదు.. మ్యూజిక్ షేర్ చేయడానికి కూడా పనికొస్తుంది. దీన్ని ఫ్రీ, ప్రీమియం యూజర్లు ఎవరైనా వాడుకోవచ్చు. అయితే, 16 ఏండ్లు నిండిన వాళ్లకు మాత్రమే దీన్ని వాడే యాక్సెస్ ఉంది. నిజానికి ఈ ఫీచర్​ గతంలోనూ ఉండేది. కానీ, దాన్ని సరిగా వాడట్లేదని, 2017లో తీసేసింది. ఇప్పుడు సబ్​స్క్రయిబర్లు పెరగడంతో మళ్లీ తీసుకొచ్చింది.