తొలిసారిగా మెస్సీ పేరు లేకుండా అవార్డులు

తొలిసారిగా  మెస్సీ పేరు లేకుండా అవార్డులు

న్యూఢిల్లీ: అర్జెంటీనా స్టార్‌‌ ఫుట్‌‌బాలర్‌‌ లియోనల్‌‌ మెస్సీ.. ప్రతిష్టాత్మక ‘బాలెన్‌‌ డీ ఓర్‌‌’ అవార్డుకు నామినేట్‌‌ కాలేదు. శనివారం ప్రకటించిన 30 మంది షార్ట్‌‌ లిస్ట్‌‌లో అతనికి చోటు దక్కలేదు. దీంతో 2005 తర్వాత జాబితాలో మెస్సీ పేరు లేకపోవడం ఇదే తొలిసారి. ఫుట్‌‌బాల్‌‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని రీతిలో మెస్సీ ఏడుసార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. బ్రెజిల్​ స్టార్​ నెయ్‌‌మార్‌‌ కూడా అవార్డు లిస్ట్‌‌లో లేడు. కైలియాన్‌‌ ఎంబపా, సాడియో మానె, కరీమ్‌‌ బెంజిమా, కెవిన్‌‌ డీ బ్రూయన్‌‌ ఇందులో ఉన్నారు. రియల్‌‌ మాడ్రిడ్‌‌ కెప్టెన్‌‌ కరీమ్‌‌ బెంజిమా ఫేవరెట్‌‌గా ఉన్నాడు.