గ్యారేజీలో ఉన్న వాషింగ్ మెషీన్​లో డెడ్​బాడీ

గ్యారేజీలో ఉన్న వాషింగ్ మెషీన్​లో డెడ్​బాడీ

టెక్సాస్: అమెరికాలో ఏడేండ్ల బాలుడు ట్రాయ్ కోహ్లెర్ వాషింగ్​ మెషీన్​లో పడి ప్రాణాలు కోల్పోయాడు. హ్యూస్టన్  సిటీకి చెందిన జర్మిన్ థామస్ దంపతులు.. ట్రాయ్ కోహ్లెర్​ను 2019లో దత్తత తీసుకున్నారు. పోయిన గురువారం రాత్రి తాను ఇంటికి వచ్చేసరికి లోపలి వైపు డోర్ లాక్ చేసి ఉందని, తన దగ్గరున్న కీతో తెరిచి లోపలికి వెళ్లానని థామస్ వెల్లడించారు.

ఆపై కొద్దిసేపటికే డ్యూటీ నుంచి వచ్చిన థామస్ భార్య పిల్లాడి గురించి ఆరా తీయగా తాను వచ్చేసరికే ట్రాయ్ ఇంట్లో కనిపించలేదని థామస్ చెప్పడంతో ఇద్దరూ కలిసి ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులు.. వాళ్ల ఇల్లంతా వెతికారు. గ్యారేజీలో ఉన్న వాషింగ్ మెషీన్​లో ట్రాయ్ కోహ్లెర్  డెడ్​బాడీని గుర్తించారు. చిన్నారి వాషింగ్​ మెషీన్​లో పడి చనిపోయాడా లేక ఎవరైనా చంపేసి పడేశారా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.