ఏడేళ్ల బాలికను కరిచిన వీధికుక్క..టీకా తీసుకున్నా..రేబీస్ వ్యాధితో మృతి

ఏడేళ్ల బాలికను కరిచిన వీధికుక్క..టీకా తీసుకున్నా..రేబీస్ వ్యాధితో మృతి

కేరళలో కుక్కకాటుకు గురైన ఏడేళ్ల బాలిక ఆకస్మాత్తుగా మృతిచెందింది. చిన్నారికి రేబిస్ వ్యాధి సోకడం వల్లే చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు. కుక్క కాటుకు రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయించనిప్పటీకి వ్యాధి లక్షణాలతో చనిపోయింది. ఇటీవల మలప్పురంలో ఇలాంటి కేసు నమోదు కావడం..కొద్దిరోజులకే రేబిస్ మరో మరణం సంభవించడంతో రేబిస్ వ్యాక్సిన్ల నాణ్యతపై స్థానికుల్లో ఆందోళన మొదలైంది.  

సోమవారం(మే5)  కేరళలోని కున్నికోడ్ కు చెందిన నియా అనే ఏడేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ వ్యాధితో మృతిచెందింది. రేబిస్ వ్యాధి నిరోధక టీకా పూర్తి కోర్సు తీసుకున్నప్పటికీ రేబిస్ వ్యాధితో మరణించిందని డాక్టర్లు నిర్దారించారు. ఏప్రిల్ 8 చిన్నారి నియాకు వీధికుక్క కాటుక గురికాక రేబిస్ పాజిటివ్‌గా తేలడంతో తిరువనంతపురంలోని అవిట్టం తిరునాల్ (SAT) ఆసుపత్రిలో కొద్దిరోజులు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. నియా సోమవారం తెల్లవారుజామున రేబిస్ ఇన్ఫెక్షన్‌కు గురై చనిపోయింది. 

ALSO READ | వీడియో కాల్ సర్జరీకి కవలలు బలి.. పెళ్లయిన ఏడేండ్లకు ప్రెగ్నెంట్.. పాపం ఇంతలోనే ఇలా..

కుక్క కరిచిన సమయంలో వైరస్ నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఉండొచ్చు..ఇలా పరిస్థితుల్లో టీకా పనిచేయదు. టీకాను అసమర్థంగా మార్చేస్తుంది. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే రేబిస్ వ్యాధి వ్యాక్సిన్ల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి స్పందిస్తూ.. కేరళలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యతను చెక్ చేసిన వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్నారని.. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తామని  తెలిపారు.