
భారత్ లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పాల్ అన్నారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని కంట్రోల్ చేయడంతో పాటు కొత్త ప్రాంతాలకు స్ప్రెడ్ కాకుండా ఆపడంలో సక్సెస్ అయ్యామన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన లక్షా 18 వేల 447 కరోనా కేసుల్లో ఎక్కువ భాగం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగానే ఉందని చెప్పారు వీకే పాల్. ప్రస్తుతం దేశంలో మొత్తం 66,330 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 70 శాతం కేవలం పది సిటీల్లోనే ఉన్నాయన్నారు. ఇక పది రాష్ట్రాలను కలిపి లెక్కగడితే దేశంలోని 90 శాతం యాక్టివ్ కేసులు తేలాయని, మిగతా దేశమంతా కలిపి 10 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు వీకే పాల్. దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లలోనే ఉన్నాయన్నారు. ఇక కరోనాతో సంభవించిన మరణాలు కూడా కొన్ని పరిమిత రాష్ట్రాలు, సిటీల్లోనే ఎక్కువగా నమోదైనట్లు వీకే పాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో కలిపి 95 శాతం, పది సిటీల్లో కలిసి 70 శాతం మరణాలు సంభవించినట్లు చెప్పారు.
10 సిటీల్లో 70 శాతం యాక్టివ్ కేసులు
ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే, ఇండోర్, కోల్ కతా, హైదరాబాద్, ఔరంగాబాద్.
5 సిటీల్లో 60 శాతం యాక్టివ్ కేసులు
ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, థానే.
10 రాష్ట్రాల్లో 90 శాతం
మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, కర్ణాటక.
5 రాష్ట్రాల్లో 80 శాతం మరణాలు
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ.
10 రాష్ట్రాల్లో 95 శాతం మరణాలు
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రపదేశ్, కర్ణాటక.
5 సిటీల్లో 60 శాతం డెత్స్
ముంబై, అహ్మదాబాద్, పుణే, ఢిల్లీ, కోల్ కతా.
10 సిటీల్లో 70 శాతం మరణాలు
ముంబై, అహ్మదాబాద్, పుణే, ఢిల్లీ, కోల్ కతా, ఇండోర్, థానే, జైపూర్, చెన్నై, సూరత్.
The confinement of #COVID19 to certain areas has been due to the actions taken during lockdown, it enables us to be more prepared for the future
– Chairman, Empowered Group I #IndiaFightsCorona pic.twitter.com/b6LAtK2wKo
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 22, 2020