70 ఏండ్లకి తల్లి అయింది

70 ఏండ్లకి తల్లి అయింది

రాజ్​కోట్: మనుమలు, మనుమరాళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో ఓ బామ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన గుజరాత్​లోని కచ్​ జిల్లాలో జరిగింది. రాపర్ ​తాలుకా మోరా గ్రామానికి చెందిన జివున్​బెన్ రబరి, బల్దారి దంపతులకు 45 ఏండ్ల కింద పెండ్లి జరిగింది. వాళ్లకి పిల్లలు పుట్టలేదు. ఎలాగైనా సంతానం పొందాలనుకున్న ఆ దంపతులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడి డాక్టర్లు ​వాళ్లకు టెస్టులు చేసి ఐవీఎఫ్ పద్ధతిలో ఆ మహిళకు గర్భం వచ్చేలా చేశారు. ఐవీఎఫ్ సక్సెస్ కావడంతో ఆమె గర్భం దాల్చి, 70 ఏండ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.