
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా కలకలం రేగింది. తాజాగా 700 మంది పోలీసులకు పాజిటివ్‌గా తేలింది. దాంతో డిపార్ట్‌మెంట్‌లోని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది వచ్చిన ఫస్ట్ వేవ్‌లో కూడా చాలా ఎక్కువ మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఆ వేవ్‌లో దాదాపు 3800 మంది పోలీసులకు కరోనా సోకితే.. వారిలో 41 మంది మృతిచెందారు. మళ్లీ ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సీపీ వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చారు.