
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజావాణికి మొత్తం 702 వినతులు వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర మైనారిటీ గురుకుల సొసైటీ అవుట్సోర్సింగ్నాన్టీచింగ్స్టాఫ్ వచ్చి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని బైఠాయించారు. తమకు ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయం కల్పించాలని కోరారు. కారణం లేకుండా ప్రిన్సిపల్స్ జాబ్ ల నుంచి తొలగిస్తున్నారని వాపోయారు.
పాత పద్ధతిలోనే కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ప్రజావాణి నోడల్అధికారి దివ్య హామీ ఇచ్చారు. ఆర్ఎంపీలను నకిలీ వైద్యులంటూ ఇండియన్మెడికల్కౌన్సిల్అధికారులు దాడులు చేస్తున్నారని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్అసోసియేషన్ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ-–2012 ఎంపికైనా, సవరణల కారణంగా జాబ్ లు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
డిగ్రీ గెస్ట్లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో145 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1600 మంది పని చేస్తున్నారని, తమను ఆటో రెన్యువల్‌తో సర్వీసు కంటిన్యూ చేయాలని కోరుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి విన్నవించారు.