
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ (79) కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (మే 1) ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, 2025, మార్చి 31న ఉదయపూర్‌లోని తన ఇంట్లో పూజ చేస్తుండగా మంటలు అంటుకుని గిరిజా వ్యాస్ గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉదయపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు.
అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆమె చనిపోయారు. గిరిజా వ్యాస్ కాంగ్రెస్ కీలక నాయకురాలు. 1991లోఆమె ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆమె కూడా పనిచేశారు. ఆమె రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్‌పర్సన్‌గా కూడా ఆమె పనిచేశారు.
గిరిజా వ్యాస్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గిరిజా వ్యాస్ మృతికి సంతాపం తెలిపారు. ‘‘కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు డాక్టర్ గిరిజా వ్యాస్ మరణం మనందరికీ తీరని లోటు. ఆమె విద్య, రాజకీయాలు మరియు సామాజిక సేవ రంగానికి గొప్ప కృషి చేశారు. అటువంటి ప్రమాదంలో ఆయన అకాల మరణం మనందరికీ పెద్ద షాక్. ఆమో ఆత్మకు శాంతి కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు.
.