ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు..!

ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు..!

పోర్టో–నోవో(బెనిన్): ఆఫ్రికాలోని మరో దేశంలో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం మడగాస్కర్, గినియా బిసావులో తిరుగుబాటు జరగగా.. తాజాగా బెనిన్ దేశంలో కొందరు సోల్జర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆదివారం ఉదయం బెనిన్ రాజధాని పోర్టో–నోవోలోని ప్రభుత్వ టీవీ చానెల్‎ను ఆక్రమించుకున్న కొందరు సోల్జర్లు దేశ ప్రెసిడెంట్ పాట్రిస్ టాలన్‏ను పదవి నుంచి తొలగించినట్టు ప్రకటించారు. 

దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. తమను తాము ‘మిలిటరీ కమిటీ ఫర్ రీఫౌండేషన్(సీఎంఆర్)’ గా అనౌన్స్ చేసుకున్నారు. అయితే, ప్రభుత్వానికి ఆర్మీ పూర్తిస్థాయి మద్దతు ఉందని, ఇది కొందరు సోల్జర్లు చేసిన తిరుగుబాటని హోంమంత్రి అలస్సనే సీడౌ ప్రకటించారు.