న్యూఢిల్లీ: ఇండియాలో ఉన్న తన భర్త రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని.. న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నికితా నాగ్దేవ్, విక్రమ్ నాగ్దేవ్ 2020 జనవరి 26న కరాచీలో పెండ్లి చేసుకున్నారు. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 26న విక్రమ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వచ్చాడు. వీసా టెక్నికల్ సమస్య సాకుతో అటారీ సరిహద్దులోనే నికితను అక్కడే వదిలేశాడు.
అప్పటి నుంచి ఆమెను తిరిగి భారత్‌కు రప్పించేందుకు విక్రమ్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని నికితా ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. "నేను, విక్రమ్ నాగ్దేవ్ భార్య నికితా నాగ్దేవ్. కరాచీ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త నన్ను మోసం చేసి ఇండియాకు వెళ్లి లాంగ్ టర్మ్ వీసాతో నివసిస్తున్నాడు. ఇండోర్‌లో వేరే అమ్మాయిని రెండో పెండ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. నా భర్తపై కఠిన చర్యలు తీసుకుని, అతన్ని వెంటనే పాకిస్తాన్ కు పంపించేయాలి” అంటూ నికిత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది
