జిందాల్ కూతురి పెళ్లిలో ఎంపీల డ్యాన్స్.. కలిసి స్టెప్పులేసిన కంగన,మహువా, సుప్రియా సూలే

జిందాల్ కూతురి పెళ్లిలో ఎంపీల డ్యాన్స్.. కలిసి స్టెప్పులేసిన కంగన,మహువా, సుప్రియా సూలే

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కూతురు యశస్విని జిందాల్ పెండ్లి శాశ్వత్ సోమనితో ఆదివారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో జరిగింది. శనివారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కంగన రనౌత్ పాటు మహువా మొయిత్రా (టీఎంసీ), సుప్రియా సూలే (ఎన్సీపీ) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీలు వేదికపై చేరుకుని పలు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్  చేశారు. ఆదివారం జరిగిన పెండ్లికి రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు హాజరయ్యారు.