తెలంగాణ రైజింగ్కు రెడీ

తెలంగాణ రైజింగ్కు రెడీ

భారత్​ ఫ్యూచర్ సిటీలో ఇయ్యాల, రేపు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​కు అంతా రెడీ అయ్యింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్​పేటలోని 100 ఎకరాల ప్రాంగణాన్ని డిజిటల్‌ హంగులతో ముస్తాబు చేశారు. సమ్మిట్​ నేపథ్యంలో దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్​ను అందంగా అలకరించారు. సిటీలోని చారిత్రక కట్టడాలపై ఆదివారం రాత్రి త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్​తో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ప్రదర్శించారు. 

రైజింగ్ తెలంగాణ విజన్‌ లక్ష్యాలు అందరికీ అర్థమయ్యేలా మెట్రో పిల్లర్లు, రహదారుల వెంట డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ప్రదర్శించారు. సమిట్​కు వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు ప్రదర్శించారు. అలాగే అతిథులకు స్వాగతం పలికేందుకు ఎయిర్​పోర్టులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  – వెలుగు, హైదరాబాద్ సిటీ