ఆమనగల్లు, వెలుగు : ఓ వీధి కుక్క దాడిలో 26 మంది గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని వేంకటేశ్వర ఆలయం నుంచి జాతీయ రహదారిపై ఉన్న సాయిబాబా ఆలయం వరకు రోడ్డుపై వచ్చి పోయే వాహనదారులు, ప్రయాణికులు, చిన్నారులు, పాదచారులపై కుక్క దాడి చేసింది.
ఈ దాడిలో ఆమనగల్లు పట్టణంతో పాటు కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు చెందినవారు గాయపడ్డారు. బాధితులు ఆమనగల్లు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
