చలి మంట కాగుతూ నిప్పంటుకొని వృద్ధురాలు మృతి.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన

చలి మంట కాగుతూ నిప్పంటుకొని వృద్ధురాలు మృతి.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన

ముత్తారం, వెలుగు : చలి మంట కాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం... గ్రామానికి చెందిన మందల కమలమ్మ (75) ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఇంటి ఎదుట చలిమంట కాగుతోంది. 

ఈ క్రమంలో ఆమె చీర కొంగుకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వృద్ధురాలు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన కమలమ్మను గోదావరిఖనిలోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు అక్కడి నుంచి వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ కమలమ్మ చనిపోయింది.