రీల్స్ పిచ్చి.. లోయలో పడి యువకుడు మృతి

రీల్స్ పిచ్చి.. లోయలో పడి యువకుడు మృతి

రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. కొందరు యువతీయువకులు ఇన్ స్టా రీల్స్ కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. బిల్డింగులపై నుంచి వేలాడటం.రన్నింగ్ ట్రైన్ లు, బస్సులు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర  రీల్స్ చేస్తున్నారు.   కొన్ని సందర్భాల్లో వారు చేసే రీల్స్ బెడిసి కొడుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్- లక్నో మార్గంలో కుసుంభి స్టేషన్ సమీపంలో  ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకున్న సంగతి తెలిసిందే..

 లేటెస్ట్ గా  కరీంనగర్ లో ఓ యువకుడు రీల్స్ చేస్తూ  బ్రడ్జి దగ్గర  నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.  అర్బాజ్ అనే యువకుడు కరీంనగర్ అలుగునూర్ బ్రిడ్జి  దగ్గర దిగువ భాగంలోని నీళ్ల దగ్గర రీల్స్ చేస్తూ అదుపుతప్పి నీటిలో పడిపోయాడు.  గల్లంతయిన  అర్బాజ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.