పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని సింధి కాలనీలో నిషేదిత మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఎస్టీఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది దాడులు నిర్వహించి పలువురి వద్ద 42 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. పది మందిపై కేసులు నమోదు చేసి కియా కారు, బైక్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మరో ఘటనలో దూల్పేటలో 29.8 గ్రాముల ఓజీ కుష్‌ను పట్టుకున్నారు. ఐదుగురిపై కేసులు బుక్ చేశారు.

