ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..తగలబడిన బస్సు..71 మంది సజీవదహనం

ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..తగలబడిన బస్సు..71 మంది సజీవదహనం

ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం( ఆగస్టు 20) పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో బస్సు, బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులోంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో 17 మంది పిల్లలు ఉన్నారు. మృతులంతా వలసదారులుగా గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇదే అతిపెద్దది అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.