ఉత్తరాదిన భారీ వర్షాలు: యూపీలో 73మంది మృతి

ఉత్తరాదిన భారీ వర్షాలు: యూపీలో 73మంది మృతి

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు యూపీ, బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంగా నదీ ప్రవాహంతో బీహార్లోని పలు జిల్లాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  ప్రధాన రహదారులు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో యూపీలో 73 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అటు బీహార్లోనూ చాలా జిల్లాలు వరద నీటిలోనే ఉన్నాయి. 18 ఎన్డీఆర్ఎఫ్ టీములు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదలతో ఇళ్ల లోపలికి నీళ్లు వెళ్లాయి. సేఫ్ బోట్ ల ద్వారా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రెస్క్యూ టీంలు.