Crime Thriller: ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. సీరియల్ కిల్లర్‌గా మమ్ముట్టి సంచలనం!

Crime Thriller: ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. సీరియల్ కిల్లర్‌గా మమ్ముట్టి సంచలనం!

మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కలంకావల్’ (Kalamkaval). డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన 'కలాంకావల్' భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించి అదరగొట్టాడు. అతడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ 'జయకృష్ణన్' పాత్రలో వినాయకన్ నటించారు.

‘కలంకావల్’ మూవీ థ్రిల్లర్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. మమ్ముట్టి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, డార్క్ టోన్ క్రైమ్ నరేషన్, మమ్ముట్టి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఊహించని ట్విస్టులు ఏ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఇది మంచి ఎక్స్‌పీరియెన్స్. ఈ క్రమంలో మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 83 కోట్లకు పైగా వసూలు చేసి, 2025 ఏడాదిలో మమ్ముట్టి ఖాతాలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

‘కలంకావల్’ ఓటీటీ:

‘కలంకావల్’ ఓటీటీ అప్డేట్పై సినీ ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ను జనవరిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ (SonyLiv) ప్రకటించింది. కానీ, స్ట్రీమింగ్ డేట్ మాత్రం వెల్లడించలేదు.

“లెజెండ్ మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా తిరిగి వస్తున్నాడు. మీకు ఊపిరి ఆడనంతగా మమ్ముట్టి నటన ఉండబోతోంది. ఈ సీజన్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కలంకావల్ ఈ జనవరిలో సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్తో సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

కలంకావల్ కథేంటంటే:

ఈ సినిమా నిజ జీవితంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ 'సయనైడ్ మోహన్' కథ ఆధారంగా రూపొందించారు. ఒక ప్రశాంతమైన ప్రాంతంలో, డిఫెరెంట్ క్రైమ్ ఇన్సిడెంట్ తో మర్డర్స్ జరుగుతుంటాయి. మొదట చిన్న కేసుల్లా కనిపించిన ఈ మర్డర్స్, క్రమంగా ఒక లోతైన క్రైమ్ మిస్టరీగా మారుతుంది. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ టీమ్, ప్రతి అడుగులోనూ షాకింగ్ నిజాలను ఎదుర్కొంటుంది. పోలీస్ అధికారి (వినాయకన్) నేతృత్వంలో జరిగే దర్యాప్తు, ఒక సీరియల్ కిల్లర్  'స్టాన్లీ దాస్' (మమ్ముట్టి) వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.

కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి, వారిని సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. స్టాన్లీ దాస్ యొక్క ప్రవర్తన, ఆలోచనలు, గతం అన్నీ కూడా అనుమానాలకు తావిస్తాయి. అయితే, స్టాన్లీ దాస్ నిజమైన నేరస్తుడా? లేదా పరిస్థితుల వల్ల నేరంలోకి నెట్టబడ్డాడా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. సినిమా మొత్తం సస్పెన్స్, మానసిక సంఘర్షణ, ఊహించని మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్రధాన బలం.