భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు: జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా చేపడుతున్నామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో జనగణన, మ్యాపింగ్‌పై సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 74.45శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.
జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గంలో 90శాతం పూర్తైందన్నారు. జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జూలూరుపాడు మండల పరిధిలోని దండుమిట్ట తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, పాపకొల్లు జీపీ స్కూల్లో ఇండుకు గుంతల నిర్మాణ పనులను కలెక్టర్ మొదలుపెట్టారు. కేజీబీవీలో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు.
