
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను జులై 21న మూవీ మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్... ఓ భారీ కటౌట్ ను ఏర్పాటుచేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ 75 అడుగుల కటౌట్ లో విజయ్... డ్రాయర్ పై ఉండి... జాతీయ జెండా ను మెడపై వేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ కటౌట్ పై ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అది కటౌట్ కాదని.. కట్ డ్రాయర్ యాడ్ అని ట్రోల్ చేస్తున్నారు.