ప్రధానమంత్రికి 75 మంది తెలంగాణ మేధావుల లేఖ

ప్రధానమంత్రికి 75 మంది తెలంగాణ మేధావుల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణకు చెందిన 75 మంది మేధావులు లేఖ రాశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడంపై మేధావులు మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. 

2023 సెప్టెంబర్ 17వ తేదీ వరకు విమోచన వజ్రోత్సవాలను (75 ఏళ్లు) కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం పట్ల హైదరాబాద్ అమరవీరులకు సరైన గౌరవాన్ని కల్పించారని తెలంగాణ మేధావులు లేఖలో పేర్కొన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని లేఖలో ప్రధానిని కోరారు.