బీహార్‌‌లో 75 వేల మరణాలు లెక్కెయ్యలే

బీహార్‌‌లో 75 వేల మరణాలు లెక్కెయ్యలే

న్యూఢిల్లీ: బీహార్‌‌లో కరోనా మరణాలు దాస్తున్నారన్న ఆరోపణలు నిజం అయ్యేలా తాజా లెక్కలు ఉన్నాయి. ఈ యేడు మొదటి ఐదు నెలల్లోనే దాదాపు 75 వేల మంది వివిధ కారణాలతో మరణించారని, ఇది కరోనా సెకండ్‌ వేవ్‌ మరణాలకు సమానంగా ఉందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. స్టేట్‌ సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 2019 జనవరి–-మే నెలల్లో 1.3 లక్షల మంది మరణించగా, 2021 ఇదే టైమ్‌లో 2.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. వీటి మధ్య సుమారు 82,500 తేడా ఉంది. 2021 జనవరి–-మే నెలల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,717 మంది కరోనాతో చనిపోయారు. అధికారిక కరోనా మరణాల సంఖ్య, సివిల్‌ రిజిస్ట్రేషన్‌ నమోదు చేసిన అదనపు మరణాల్లో తేడా కొంతవరకు మాత్రమే ఉంది. అయితే ఈ తేడా 74,808గా నమోదైంది. ఈ మరణాలు ఎప్పుడు జరిగాయో చెప్పకపోయినప్పటికీ, అవి 2021లోనే జరిగినట్లుగా భావిస్తున్నారు.