
- రూ.6.4 లక్షల కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బ్రహ్మపుత్రా బేసిన్ నుంచి 76 గిగావాట్ల హైడ్రో పవర్‌ను 2047 నాటికి తరలించేందుకు రూ.6.4 లక్షల కోట్ల (77 బిలియన్ డాలర్ల) ను ఇన్వెస్ట్ చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌మిషన్ ప్రణాళికను రూపొందించిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్–బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటి సామర్ధ్యం 64.9 గిగావాట్లు. మరో 11.1 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను కూడా ప్రభుత్వం కట్టనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నది చైనా సరిహద్దుకు సమీపంగా ఉండటంతో, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వ్యూహాత్మకంగా మారింది. సీఈఏ ప్రకారం, ప్రణాళిక తొలి దశలో (2035 వరకు) రూ.1.91 లక్షల కోట్లు, రెండో దశలో రూ.4.52 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వ కంపెనీలు ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఈఈపీసీఏ, ఎస్‌జేవీఎన్‌లకు ప్రాజెక్టులు కేటాయించారు.
2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యం, 2070 నాటికి నెట్-జీరో లక్ష్యంగా కేంద్రం ముందుకెళుతోంది.