
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,10,141 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయంది. కొవిడ్-19తో 7 మంది చనిపోయారని.. 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుందని.. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉందంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారని తెలిపింది వైద్యారోగ్యశాఖ.