శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళా ప్యాసింజర్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  మహిళా ప్యాసింజర్ అరెస్ట్

శంషాబాద్, వెలుగు: శానిటరీ ప్యాడ్​లో బంగారాన్ని స్మగ్లింగ్​ చేయడానికి ప్రయత్నించిన ఓ ప్యాసింజర్​ను  శంషా బాద్  ఎయిర్ పోర్టులో కస్టమ్స్  అధికా రులు అదుపులోకి తీసుకున్నారు. మస్కట్​ నుంచి శంషాబాద్​కు వచ్చిన విమానంలో ఒక మహిళ అనుమానాస్ప దంగా కనిపించింది.

ఆమెను మహిళా అధికారులు అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శానిటరీ ప్యాడ్​లో దాచి తరలిస్తున్నట్లు బయట పడింది. ఆమె వద్ద నుంచి 1,476 గ్రాముల గోల్డ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగా రం విలువ రూ.77,90,534 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితురాలిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.