సీఐఎస్​ఎఫ్​లో 787 కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు

సీఐఎస్​ఎఫ్​లో 787 కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు

సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ దేశవ్యాప్తంగా 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌మెన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. పదో తరగతి అర్హతతో మహిళలు, పురుషులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నార్తర్న్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, వెస్ట్రన్‌‌‌‌‌‌‌‌, సెంట్రల్‌‌‌‌‌‌‌‌, ఈస్ట్రన్‌‌‌‌‌‌‌‌, సదరన్‌‌‌‌‌‌‌‌, సౌత్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్రన్‌‌‌‌‌‌‌‌, నార్తర్న్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్రన్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. పురుష అభ్యర్థులు 170 సెం.మీ., ఛాతీ- 80- – 85 సెం.మీ. మహిళా అభ్యర్థుల ఎత్తు- 157 సెం.మీ. ఉండాలి.

సెలెక్షన్​: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌‌‌‌‌‌‌‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్‌‌‌‌‌‌‌‌ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్​ 20 వరకు అప్లికేషన్​ ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.cisfrectt.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: పీఎస్‌‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల సమయం కేటాయించారు.  100 ప్రశ్నలకు 100 మార్కులు  ఉంటాయి. జనరల్ అవేర్‌‌నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌‌/ హిందీ మీడియంలో క్వశ్చన్​పేపర్​  ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు.