8ఏళ్లలో 7928 కిలో మీటర్ల రోడ్లు పూర్తి చేసినం : ప్రభుత్వం

8ఏళ్లలో 7928 కిలో మీటర్ల రోడ్లు పూర్తి చేసినం : ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7,928 కిలో మీటర్ల రెండు లైన్ల రోడ్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 321 కి.మీ ఫోర్​వే, 47 కి.మీ సిక్స్ వే, 350 బ్రిడ్జీలు, 8,064 కి.మీ రోడ్ల రెన్యువల్స్ పూర్తి చేశామని గురువారం ప్రగతి నివేదికలో భాగంగా ప్రభుత్వం ప్రకటించింది. మండల కేంద్రాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లకు డబుల్ లైన్​ రోడ్లు, మండలాలు, జిల్లాలను రాష్ట్ర రాజధానితో కలిపే సింగిల్ లైనింగ్ రోడ్లను డబుల్​ లైనింగ్​కు మార్చామని ప్రభుత్వం పేర్కొంది. వర్షాల టైంలో వాగులు, నదులపై శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలను పునర్​నిర్మించినట్టు తెలిపింది. రూ.2,763 కోట్లతో 541 కొత్త బ్రిడ్జిల నిర్మాణాలు ప్రారంభించగా.. 350 పూరైనట్టు చెప్పింది.

ఓఆర్ఆర్ వెళ్లేందుకు రేడియల్ రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. 8ఏండ్లలో రాష్ర్టానికి 2,525 కి.మీ నేషనల్ హైవేస్ ను కేంద్రం ప్రకటించిందని పేర్కొంది. ఆర్అండ్​బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్ లు, అంబేద్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 340 కి.మీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పింది.