గాలి కాలుష్యంతో ఇండియాలో ఏటా 18 లక్షల మృతులు

గాలి కాలుష్యంతో ఇండియాలో ఏటా 18 లక్షల మృతులు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న గాలి కాలుష్యం మనుషుల్ని చంపేస్తోంది. భయంకరమైన రోగాలు,యుద్ధాలు, స్మోకింగ్‌‌ కన్నా ఎక్కువ సంఖ్యలో బలి తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 88 లక్షలమంది వరకు ఎయిర్‌‌ పొల్యూషన్‌‌ వల్లే చనిపోతున్నారు. ఇందులో ఇండియన్లే 18 లక్షల మంది వరకు ఉన్నా రు. కలుషితమైన గాలి పీల్చుకున్న మనుషుల జీవిత కాలం కూడా ఏటేటా తగ్గిపోతోంది. జర్మనీ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం చేసిన రీసెర్చ్‌‌లో ఈ విషయం వెల్లడైంది. పొగాకు తాగితే 2.2 ఏండ్లు, హెచ్‌‌ఐవీ వల్ల 0.7, మలేరియా లాంటి రోగాల వల్ల 0.6 ఏండ్లు , హింస వల్ల 0.3 ఏండ్లు జీవిత కాలం తగ్గితే పొల్యూషన్‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటున2.9 ఏండ్లు జీవితకాలం తగ్గుతోందని సైంటిస్టులు చెప్పారు. 2015లో పొల్యూషన్‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది చనిపోయారని, అదే పొగాకు వల్ల 72 లక్షలు, హెచ్‌‌ఐవీ వల్ల 6 లక్షలు, హింసవల్ల 5.3 లక్షల మంది మరణించారని సైంటిస్టులు వివరించారు.

జపాన్‌‌, ఇండియాల్లో బాగా..

కాలుష్యం వల్ల ఈస్ట్‌‌ ఏసియాలో ముఖ్యంగా జపాన్‌‌, ఇండియాల్లో మనుషుల జీవిత కాలం నాలుగేళ్లు తగ్గిందని, యూరప్‌‌లో రెండున్నరేళ్లు తగ్గిందని సైంటిస్టులు చెప్పారు. కలుషితమైన గాలిని ఎక్కువ కాలం పీల్చుకుంటే గుండె, రక్తనాళాలపై ప్రభావంపడి మనుషులు త్వరగా చనిపోతున్నారన్నా రు. ప్రపంచవ్యాప్తంగా 60 ఏండ్లు పై బడిన వాళ్లలో 75 శాతం మరణాలు గాలి కాలుష్యం వల్లేనని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడింట రెండొంతుల మంది మరణాలను ఆపొచ్చని, వీళ్లంతా పొల్యూషన్‌‌ వల్లే చనిపోతున్నరని చెప్పారు.

పెట్రోల్‌‌, డీజిల్‌‌ వాడకుంటే..

మనుషులు ఉత్పత్తి చేస్తున్న పొల్యూషన్‌‌ లేకపోయుంటే ప్రపంచవ్యాప్తంగా జనం జీవిత కాలం రెండేళ్లు పెరిగేదని సైంటిస్టులు చెప్పారు. పెట్రోల్‌‌, డీజిల్‌‌ వాడకుండా ఉండుంటే ఏడాది వరకు పెరిగేదన్నారు. పొల్యూషన్‌‌ వల్ల ఆఫ్రికాలో ప్రజల జీవితకాలం స్థాయిమూడేళ్ల వరకు తగ్గిందని చెప్పారు. ఇందులో కేవలం0.7 వరకే పెంచగలమని, ఇక్కడ ఎక్కువ పొల్యూషన్‌‌ దుమ్ము వల్లేనని వివరించారు. ఈస్ట్‌‌ ఆసియా దేశాల్లోపెట్రోల్‌‌, డీజిల్‌‌ వల్ల పొల్యూషన్‌‌ ఎక్కువని, దాన్నిఈజీగా కట్టడి చేయొచ్చని చెప్పారు. యూరప్‌‌లోయావరేజ్‌ గా 2.2 ఏండ్లు జీవితకాలం తగ్గుతోం దని,ఇందులో 1.7 ఏండ్ల వరకు పెంచొచ్చని అన్నా రు.ఉత్తర అమెరికాలో 1.4 ఏండ్ల వరకు తగ్గుతోం దని,ఇందులో 1.1 ఏండ్లు తగ్గించొచ్చని పేర్కొన్నారు.