రివర్స్ ఎత్తిపోత : పార్వతి బ్యారేజ్ నీళ్లు.. మళ్లీ గోదావరిపాలు

రివర్స్ ఎత్తిపోత : పార్వతి బ్యారేజ్ నీళ్లు.. మళ్లీ గోదావరిపాలు

కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా.. నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగటంతో.. మిగతా బ్యారేజీల విషయంలో అప్రమత్తం అయ్యారు అధికారులు. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల కమిటీ.. అన్ని బ్యారేజీల్లోని నీటిని ఖాళీ చేసి.. నిర్మాణాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే.. నవంబర్ 9వ తేదీ పార్వతీ బ్యారేజ్ లోని నీటిని గోదావరి నదిలోకి వదిలేశారు అధికారులు. 

also read : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను ఓడిస్తం : పురుషోత్తం రూపాల

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు నాణ్యతగా లేవని ప్రాజెక్టులో ఉన్న నీటిని వదలాలని కేంద్ర జన వనరుల శాఖ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పార్వతీ బ్యారేజ్ మధ్యలో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు.  

ఎల్లంపల్లి, మేడిగడ్డ మధ్య మూడు బ్యారేజీల నిర్మాణం కోసం ప్రతిపాదించిన మూడు బ్యారేజీలలో  పార్వతీ బ్యారేజ్ ఒకటి. దీనిని  సుందిళ్ళ బ్యారేజి అని కూడా అంటారు.  రామగిరి మండలంలో దాదాపు 1200 మంది జనాభా ఉన్న చిన్న గ్రామమైన సుందిళ్ల గ్రామం పేరు మీద సుందిళ్ల బ్యారేజీకి పేరు వచ్చింది.