కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష

కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే 8 మంది ఐఏఎస్ అధికారులు హైకోర్టును క్షమాపణ కోరడంతో న్యాయస్థానం శిక్షను తప్పించింది. అయితే శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లలో నెలకు ఒక రోజు సేవ చేయాలంటూ తీర్పునిచ్చింది. అలాగే ఒక రోజు కోర్టు ఖర్చులను కూడా భరించాలని చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసులో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ , రాజశేఖర్ , చినవీరభద్రుడు, జె.శ్యామలరావుతో, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్, విజయ్ కుమార్ లు ఉన్నారు. కాగా.. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు పాటించకపోవడంతో కోర్టు పై తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తల కోసం:

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం

‘రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు