ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంభాల్‌లో ఆగ్రా-మొరాదాబాద్ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌ ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మంది చనిపోగా…దాదాపు 25 మంది గాయపడ్డారు.

సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే లారీని యూపీ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఓవర్‌టెక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామయ్యింది.