
హైదరాబాద్ : ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పేకాట ఆడుతూ 8 మంది అడ్డంగా బుక్కయ్యారు. శుక్రవారం ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కు కేటాయించిన 129 క్వార్టర్స్ లో ఆయన అనుచరులు కొంత మంది గుట్టుచప్పుడుగా పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు క్వార్టర్స్ కు చేరుకుని పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి రూ. లక్ష 12వేల నగదు, 8 మొబైల్స్ , ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.