8 Vasantalu : జూన్‌‌‌‌‌‌‌‌లో 8 వసంతాలు మూవీ విడుదల

8 Vasantalu : జూన్‌‌‌‌‌‌‌‌లో 8 వసంతాలు మూవీ విడుదల

అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  హృదయాన్ని కదిలించే ఈ ప్రేమ గాథ  ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోందని దర్శక నిర్మాతలు  చెప్పారు. 

ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో చీర కట్టుకుని ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌ లో ఆకట్టుకుంది అనంతిక. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రానికి  హేషమ్  అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.