బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి 80 ఆర్టీసీ స్పెషల్ బస్సులు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి 80 ఆర్టీసీ స్పెషల్ బస్సులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో భక్తుల సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

మొత్తం 80 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, మల్కాజిగిరి, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు.