రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసులు

మరో 49 మందికి కరోనా.. ముగ్గురు మృతి
858కి చేరిన కేసులు, 21కి చేరిన మరణాలు
గాంధీ హాస్పిటల్లో రెండు నెలల చిన్నారి మృతి
గత వారం రోజుల్లోనే 327 మందికి పాజిటివ్‌‌
రాష్ట్ర వ్యాప్తంగా 292 కంటెయిన్మెంట్ జోన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో 49 మందికి కరోనా సోకింది. ఇంకో ముగ్గురు మరణించారు. ఇందులో నారాయణపేటకు చెందిన 2 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారిలో 20 మంది 40 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసువారే.. తొలిసారిగా ఒక పిల్లాడు మరణించాడు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 858కి చేరింది. వారం రోజుల్లోనే 357 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 186 మంది (22 శాతం) కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 21 మంది(2.44 శాతం) మరణించారు. మిగతా 651
మంది ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారు. వారంతా వచ్చే నెల నాలుగో తేదీ నాటికి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సర్కారు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 127 సెంటర్లలో 1,818 మంది క్వారంటైన్‌‌‌‌లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో 183 మంది, జిల్లాల్లో 1,625 మంది ఉన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్లోనే 38 కేసులు
ఆదివారం నమోదైన 49 కేసుల్లో.. గ్రేటర్‌ ‌‌‌‌‌‌‌హైదరాబాద్‌ పరిధిలోనే 38 ఉన్నాయి. దీంతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో కేసుల సంఖ్య 470కి చేరింది. వికారాబాద్‌లో 4, నల్గొండలో 2, ఆదిలాబాద్‌ 5 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

292 కంటెయిన్‌‌‌‌మెంట్‌ జోన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 292 కంటెయిన్‌‌‌‌మెంట్ జోన్లుండగా జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో 151, పట్టణ ప్రాంతాల్లో 87, గ్రామీణ ప్రాంతాల్లో 54 జోన్లున్నాయి. 292 జోన్లకుగాను.. ఈ నెల 20 నాటికి 138 చోట్ల, 26 నాటికి 36 చోట్ల, 30 నాటికి 61 జోన్లలో, వచ్చే నెల మూడో తేదీ నాటికి 57 జోన్లలో 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తవుతుందని సర్కారు ప్రకటించింది. ఇక కరోనా కోసం 3 దశల్లో 12,400 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో 11 వేల ఐసోలేషన్‌‌‌‌బెడ్లు, 836 ఐసీయూ బెడ్లు, 564 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనుంది.

అవసరమైన మెడిసిన్‌ అందుబాటులో..
రాష్ట్రంలో 3.04 లక్షల పీపీఈ కిట్లు, 3.53 లక్షల ఎన్‌‌‌‌95 మాస్కులు, 21,366 టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని సర్కారు ప్రకటించింది. కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అవసరమైన హైడ్రాక్సి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు 12.35 లక్షలు, అజిత్రోమైసిన్‌‌‌‌250 ఎంజీ ట్యాబ్లెట్లు 19.09 లక్షలు, అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు 28.98 లక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా సోకకుండా రాష్ట్రంలోని 50,807
మంది హెల్త్ వర్కర్స్‌‌‌‌కు హైడ్రాక్సి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చినట్టు పేర్కొంది.

లాక్‌ డౌన్‌లో 29,991 జననాలు
రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ సేవలు ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని సర్కారు తెలిపింది. లాక్‌‌‌‌డౌన్ మొదలైనప్పటి నుంచి శనివారం నాటికి రాష్ట్రంలో 29,991 డెలివరీలు జరిగినట్టు వెల్లడించింది. 94.4 శాతం ఇమ్యునైజేషన్ పూర్తి చేశామని పేర్కొంది. 580 మంది తలసేమియా పేషెంట్లకు, 5,050 మంది డయాలసిస్‌, 1,507 మంది కేన్సర్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామని తెలిపింది.

టెస్టులు చేస్తున్న ప్రతి 17 మందిలో ఒకరికి వైరస్
రాష్ట్రంలో ఇప్పటివరకు 14,962 మందికి టెస్టులు చేయగా.. 858 మందికి వైరస్ పాజిటివ్‌‌‌‌వచ్చింది. అంటే ప్రతి 17 మంది అనుమానితుల్లో ఒకరికి పాజిటివ్ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని తొమ్మిది ల్యాబుల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. రోజుకు 1,560 శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి 768 శాంపిళ్లు టెస్టుల కోసం పెండింగ్లో ఉన్నాయి.

For More News..

దేశంలో 17 వేలు దాటిన కేసులు

ఎక్కడ చిక్కుకున్నోళ్లకు అక్కడే ఉపాధి

3 లింకులు,29 కేసులు.. క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు

వైరస్ బారిన వారియర్స్