జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ లోని తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ యూనిట్ లో ఆదివారం నిర్వహించిన 72 గంటల 800ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెల 1న ప్రారంభమైన రన్ అనేక సవాళ్ల మధ్య 842.6 మెగావాట్ల ఉత్పత్తిని సాధించింది.
దీంతో త్వరలోనే కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్ ప్రకటించనున్నారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. జీఎంలు సురేశ్, సంజీవ్ సాహా, సంతోష్ తివారి, మోహన్ రెడ్డి, అలోక్ కుమార్ త్రిపాఠి, రవీంద్ర పటేల్ ను ఈడీ అభినందించారు.
