81 మంది జేఎల్స్కు ప్రిన్సిపాల్స్గా ప్రమోషన్లు

81 మంది జేఎల్స్కు ప్రిన్సిపాల్స్గా ప్రమోషన్లు
  • నిబద్ధతతో పనిచేయాలన్న డైరెక్టర్ కృష్ణ ఆదిత్య 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 81 జూనియర్ కాలేజీలకు కొత్త ప్రిన్సిపాల్స్ వచ్చారు. సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డులో ప్రిన్సిపాల్ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్​గా పదోన్నతి కల్పించారు. వెంటనే పోస్టింగులు కూడా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడారు.

 ప్రమోషన్లు పొందిన లెక్చరర్లను ఆయన అభినందించారు. కొత్త బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్కారు జూనియర్ కాలేజీలను మరింత మెరుగుపరిచేలా కృషి చేయాలని కోరారు. ప్రమోషన్ల ప్రక్రియ ప్రతిభ, సేవలకు ప్రాధాన్యత ఇస్తూ, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సీఈఈ జయప్రదబాయి పాల్గొన్నారు.