
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 813 మందికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 755 మంది లోకల్స్ కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారు 8 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 50 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,098కి చేరింది. అయితే కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 169కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 5908 డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.